Tuesday, 29 September 2020
తెలుగు భాష
మన మాతృ భాష తెలుగు గురించి,తెలుగుని కాపాడుకోవడం కోసం ఎంతో మంది వ్యక్తులు,రచయితలు ఎలా శ్రమ పడుతూ వున్నరో తెలుస్తూ ఉంది.తెలుగు భాష గొప్ప తనం గురించి ఎందరెందరో ఎన్నో రకాలు గా చెప్పారు. ఈరోజు నేను కొత్త గా తెలుగు భాష గురించి చెప్పాలంటే ఎమీ లేదు. కానీ నిన్న స్వర్ణ కమలం సినిమా పాటలు వింటుంటే ఒక పాట లొ తూరుపు వేదిక పై వేకువ నర్తకి వై ధాత్రి ని మురిపించే అనే చరణం ధ్యాసగా విన్నా. ఇంత అందమైన పద విన్యాసం మనకు పరిచయం చేసిన ఆ మహానుభవుడైన విశ్వనాథ్ గారికి,రాసిన రచయిత గారికి నమస్సుమాంజలులు..చిన్న చిన్న పదాలూ,చక్కటి భావం తో వింటూంటే ఒక రకమైన హాయిని కలిగించే పద ప్రయోగాలు ఎన్నెన్నో.ఒక మంచి ఙ్ఞాపకం సన్న జాజుల పరిమళం లా మనల్ని చుట్టుముడుతుంది.అలా పొన్న చెట్ట్లు,పండు వెన్నెల,విరజాజులు,మధుసీమలు,మలయానిలము, పలుకులు బంగారమవటం ,సంజకెంజాయలు,సంధ్యా రాగాలు,సుమబాలలు,రాధామనొహరాలు,ఆకాశదేశాలు, మేఘామాలికలు,మేఘసందేశాలు,శ్రావణ మేఘాలు,శరత్కాలపు వెన్నెలలు,కమల నయనాలు, సంధ్యా కాంతలు,హేమంత రుతురాగాలు, అపరాహ్ణం వేళలు,వానవిల్లులు, శిశిరవాసంతాలు, కలకూజితాలు ఇలాంటి మాటలు మన జెనెరేషన్ వాళ్లకి బాగా విన్నవి,వాడినవి కొన్ని. మన ముందు తరం వారు కవితావేశము లో విరివిగా వాడి మనకు అందించినవి. ఎలాంటి సమయం లో నైనా ఇలాంటి పదాలు విన్నా మనసంతా అదో రకం మైన సంతోషం తో, వింత హాయికి గురి అవుతుంది. దానికి కారణం తెలియకుండా వాటి మీద మక్కువ పెంచుకొవటము వల్ల కావచ్చు. కానీ ఈ తెలుగు భాష ప్రయోగాల్లోని మాధుర్యాన్ని నేను మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ వున్నాను.నా పిల్లలు,నెక్స్ట్ జెనెరేషన్ వీటన్నిటినీ మిస్స్ అవుతుందని తుమ్మెదల ఝంకారం లా గుర్తు చేస్తూనేవుంటుంది.....
Subscribe to:
Posts (Atom)